TG: నెట్ ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని CM రేవంత్ వ్యాఖ్యానించారు. నెట్ ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. నెట్ ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని పేర్కొన్నారు. 500 పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామన్నారు.