W.G: భీమవరం బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సోమవారం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.