సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తమిళ లెజెండ్ MGRపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరో విశాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కాంతారావుని పొగడటం కోసం, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, లెజెండరీ నటుడు MGRని తక్కువ చేయడం సరికాదని ట్వీట్ చేశాడు. ఒక లెజెండ్‌ను గౌరవిస్తూనే మరో మహానుభావుడిని అవమానించడం బాధాకరమని, ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ స్పష్టతనిస్తూ క్షమాపణలు చెప్పాలని విశాల్ కోరాడు.