ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న చెక్కభజన గజ్జెల పూజకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమ ఖర్చుల కోసం ఆయన రూ.20 వేలను నిర్వాహకులకు అందజేశారు. గ్రామీణ కళలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురువు లక్ష్మినారాయణ పాల్గొన్నారు.