చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని SP తుషార్ డూడీ హెచ్చరించారు. ‘యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సిలిండర్ కొరత, ధరలు భారీగా పెరిగాయి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ లాంటి సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మోద్దన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.