కరీంనగర్: జిల్లాలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలే లక్ష్యంగా సివిల్ సప్లై, టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నింపుతున్న కేంద్రాలపై దాడి చేసి 8 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.రెండు హోటళ్లలో తనిఖీలు చేపట్టగా, అక్రమంగా నిల్వ ఉంచిన మరో 14 సిలిండర్లు లభ్యమయ్యాయి.