NGKL: బిజినేపల్లి మండలంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు 574 మంది విద్యార్థులు హాజరుకానున్నారని MEO రఘునందన్ శర్మ తెలిపారు. వీరిలో 322 మంది బాలురు, 252 మంది బాలికలు ఉన్నారన్నారు. మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 4 చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.