W.G: ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.