అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ కోసం సరికొత్త మేకోవర్‌తో ఆకట్టుకుంటున్నాడు. ‘తండేల్’ చిత్రంలో డీ గ్లామ్ లుక్‌లో కనిపించిన చైతు.. ఈ సినిమా కోసం పూర్తి స్టైలిష్‌గా మారిపోయాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. అందులో జిమ్ నుంచి షేర్ చేసిన 6 ప్యాక్ బాడీ పిక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డంబెల్స్ పట్టుకుని బల్క్ బాడీతో కనిపిస్తున్నాడు.