AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ విచారణకు హాజరుకాలేదు. హైకోర్టు ఆదేశాలతో ఏడు రోజులుగా ఉదయం 10 గంటలకు విచారణకు హాజరైన సునీల్ ఇవాళ ఉదయం 11:30 గంటలైనా సీసీఎస్ స్టేషన్కు రాలేదు. 8వ రోజు సునీల్ విచారణకు హాజరు కాకపోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఇవాళ హైకోర్టులో సునీల్ మధ్యంతర బెయిల్ అర్హత పిటిషన్ విచారణకు రానుంది.