బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి పర్వీన్ ఖాన్ (65) అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. తల్లి మరణంతో జరీన్ ఖాన్ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.