JGL: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ధర్మపురిలో ఆశావర్కర్లు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే క్షేత్రస్థాయి కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.