TG: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు మిథిలా స్టేడియంలో వైభవంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 11:06 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. ఎల్లుండి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇవాళ అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పూజారులు ఏర్పాట్లు చేశారు.