TG: LPG కొరతపై ప్రధాని మోదీ మాట్లాడటం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్లో ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. LPG సమస్యను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ అజెండాగా మారిందని విమర్శించారు. ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు.