AP: తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హోటళ్లలో ఐస్క్రీమ్, వాటర్ శాంపిళ్లను సేకరించారు. తిరుమలలో నాసిరకం ఐస్క్రీమ్ అమ్మకాలపై ఫిర్యాదులు రావడంతో.. TTD అధికారులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరిపారు. నాసిరకం పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్ల నిర్వాహకులను టీటీడీ అధికారులు హెచ్చరించారు.