AP: ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొన్ని ప్రాంతాలకే పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్ర ఫలితాలు వస్తాయన్నారు. అందుకే జోన్లు ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఏ జిల్లాకు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో సీఎం స్వయంగా వివరించారు.