BPT: పట్టణంలోని జీబీసీ రోడ్డులో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. హెచ్పీ గ్యాస్ గూడెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గ్యాస్ సిలిండర్ల ఆటో ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన బైక్ చోదకుడిని గమనించిన స్థానికులు, వెంటనే చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.