TPT: తిరుమల సన్నిధానం అతిథిగృహం సమీపంలోని ‘నైవేద్యం’ హోటల్‌ను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఓ కుటుంబంలోని బాలుడు హోటల్లో ఐస్‌క్రీం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ అధికారులు హోటల్‌ను పరిశీలించి తాత్కాలికంగా మూసివేశారు.