KRNL: ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయ స్థల ఆక్రమణ అంశాన్ని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. సనాతన ధర్మం, దేవాలయాల జోలికి వచ్చేవారిని ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. కోతుల బావి దేవాలయ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.