కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అంగర విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్డీఎస్ఎల్ పథకంలో భాగంగా అగ్రికల్చర్ లైన్లు ఏర్పాటు, 3 ఫేజ్ సరఫరా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కపిలేశ్వరపురం, అంగర, మాచరమట్ల గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రత్నాలరావు తెలిపారు.