KKD: ప్రత్తిపాడు నియోజకవర్గంపై ముద్రగడ కుమార్తె క్రాంతి దృష్టి సారించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆమె స్పందిస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. జనసేన అధినేత ఎన్నికల ప్రచార సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతికి టికెట్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.