ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 29వ వార్డులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పర్యటించారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురికి నీరు ప్రవాహం సరిగా లేదని కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి మురికి నీరు సాఫీగా వెళ్లేలా చేయాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు.