IPL చరిత్రలో గొప్ప టీమ్స్ గురించి చెప్పాలంటే ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) రెండూ సమానమేనని క్రికెట్ దిగ్గజం అనీల్ కుంబ్లే పేర్కొన్నాడు. CSK తమ సీనియర్ల మీదనే ఎక్కువ ఆధారపడితే, MI యంగ్ టాలెంట్‌ని గుర్తించి ప్రోత్సహిస్తుందని.. చెరో 5 ట్రోఫీలు గెలిచిన ఈ జట్ల మధ్య ఇదే తేడా అని తెలిపాడు. గతేడాది సమష్టి కృషితో RCB తమ తొలి టైటిల్ గెలుచుకుందన్నాడు.