VSP: తాత్కాలిక ఉద్యోగులతో తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం శ్రమ దోపిడీ అని, వారిని రెగ్యులరైజ్ చేయాలన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీవేజ్ సహా లక్షలాది మంది ఉద్యోగులకు సమాన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు.