AP: YSRCP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అప్పులన్నీ ఎటు వెళ్తున్నాయో తెలియడం లేదని, పోలవరం, రాయలసీమ అభివృద్ధి లేదని మండిపడ్డారు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఎప్పుడూ రాలేదని, భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని వేడుకున్నారు.