ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలాది పూరిళ్లు అగ్నికి ఆహుతై కాలిబూడిదయ్యాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగి వేగంగా విస్తరించడంతో బస్తీ నివాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.