KDP: VN పల్లె(M) అడవి పల్లె గ్రామానికి చెందిన నల్ల మేకల అంకమ్మ(25)ఆచూకీ లభిస్తే ఎవరైనా తమకు సమాచారం ఇవ్వాలని గంగిరెడ్డిపల్లి ఎస్సై కృష్ణయ్య కోరారు. మతి స్థిమితం సరిగా లేని ఈ మహిళ 10వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు బుధవారం ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.