NDL: బనగానపల్లె కేజీబీవీ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్వో సునీత తెలిపారు. ఇవాళ నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు.