అడివి శేష్ తన కొత్త సినిమా ‘డెకాయిట్’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇది విడిపోయిన ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అని ఆయన తెలిపాడు. నాగచైతన్య పెళ్లి వేడుకలో అనురాగ్ కశ్యప్‌కు ఈ కథ వినిపించగా, ఆయన వెంటనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శేష్ వెల్లడించాడు. ఈ చిత్రం సరికొత్త ప్రేమకథగా ప్రేక్షకులను అలరించనుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.