W.G: నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో బుధవారం సాయంత్రం కోడి పందాల శిబిరంపై పోలీసులు దాడి చేసినట్లు రూరల్ ఎస్సై టి.వెంకట సురేశ్ తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.4,460 నగదు, 2 పందెం కోళ్లు, కోడి కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.