AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఎనిమిదో రోజు విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ్టి విచారణ కీలకంగా మారనుంది. ఏడు రోజుల పాటు జరిగిన విచారణలో సునీల్ నాయక్ పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. సునీల్ నాయక్‌ను దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు.