AP: వైఎస్సార్సీపీ అధినేత జగన్ తాడెపల్లిగూడెంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడారు. 2011, మార్చి 12న వైసీపీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. వైసీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించిందన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాట ఆవిర్భావానికి కారణమైందన్నారు. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చిందన్నారు. వైసీపీ కొన్ని కోట్ల ప్రజలదని తెలిపారు.