ప్రకాశం: మార్కాపురం వైసీపీ కార్యాలయంలో ఇవాళ వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాస్ రెడ్డిలు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. YS జగన్ ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేశారని, అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు.