NDL: డోన్‌లో నెహ్రు నగర్ ఎంపీపీ పాఠశాలలో బుధవారం విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐదో తరగతి విద్యార్థి దోమల మందు స్ప్రేను తరగతి గదిలో పిచికారీ చేయడంతో దాని వాసన పీల్చుకున్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి వారిని పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పెద్దగా ప్రమాదం లేదని తెలిపారు.