అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య దాడులు 13వ రోజుకు చేరుకున్నాయి. ఇరాక్ జలాల్లోని రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ సూసైడ్ బోటులతో దాడులు చేసింది. దీంతో భారీగా చమురు లీక్ అయి మంటలు చెలరేగాయి. దాడికి గురైన రెండు ట్యాంకర్లలో ఒకటి అమెరికాకు చెందినది. ఈ ఘటనలో భారత్కు చెందిన ఒక వ్యక్తి మృతిచెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.