సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. దివంగత నటుడు కాంతారావును పొగిడే క్రమంలో, తమిళ లెజెండ్ MGRపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని ‘నడిగర్ సంఘం’ మండిపడింది. ఒకరిని గౌరవించడానికి మరొకరిని కించపరచడం సరికాదని, రాజేంద్రప్రసాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.