VZM: రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్ర రావు స్దానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం బాబానగర్, గాయత్రీ కాలనీలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఎస్టిమెట్లు తయారుచేయమని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.