AKP: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్ రాము డిమాండ్ చేశారు. గురువారం పూడిమడకలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని నినాదాలు చేశారు. యుద్ధం పేరుతో వ్యాపారస్తులు గ్యాస్, ఇతర నిత్యవసర వస్తువులను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల హోటల్స్ మూతపడుతున్నాయన్నారు.