KRNL: విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని AISF జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్ సూచించారు. ప్యాపిలి మండలం చిన్న పూజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.