KRNL: ఆదోనిలో బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జేసీ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారంలో అధికారులు వెనుకబడి ఉన్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సీనియర్ సిటిజన్స్ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.