KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు KVK సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి ఇవాళ తెలిపారు. వేసవిలో పంటల యాజమాన్య పద్ధతులు గురించి వివరించనున్నట్లు చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదల సందర్భంగా PM నరేంద్రమోదీ ప్రసంగం ఉంటుందన్నారు.