అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వం సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2025 డిసెంబర్లో జిల్లాలో ప్రభుత్వ సేవలపై సంతృప్తి శాతం 67.8 ఉండగా జనవరి, ఫిబ్రవరి నెలలో 16 శాతం పెరిగిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ సేవలపై రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వివరాలు సేకరించామన్నారు.