NLR: స్వర్ణాల చెరువును 33,34,35 వార్డుల్లో ఆక్రమించేస్తున్నారు. మాజీ కార్పొరేటర్ 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో చెరువు స్థలంలో కొన్ని అంకణాలను ఆక్రమించి, గదులు నిర్మాణాలు చేపట్టారు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన అధికారులు అక్కడ నిర్మాణాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.