‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదలకు సిద్ధమవుతుండగా, చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి పవన్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారట. ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసిన పవన్, ఇంటర్వ్యూకు OK చెప్తే మూవీకి భారీ మైలేజ్ లభిస్తుందని అనుకుంటున్నారు. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.