పశ్చిమగోదావరి: జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంలో నిబంధనలు ఉల్లంఘించిన 12 మెడికల్ షాపుల లైసెన్స్ రద్దు, 550 మెడికల్ షాపులపై సస్పెన్షన్ విధించామని అసిస్టెంట్ డైరెక్టర్ చక్రవర్తి బుధవారం తెలిపారు. ప్రజలు మందుల కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే 8632330909, 9491063158 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.