NLR: సంగం ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వసుమతి బుధవారం సందర్శించారు. పంచాయతీ పరిధిలోని ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని పంచాయతీలలో ఇప్పటివరకు వసూలు చేసిన పన్నుల వివరాలు తెలుసుకుని ప్రత్యేక సమయం కేటాయిస్తూ వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.