WGL: పర్వతగిరి(M) కల్లెడ శివారు అకేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కల్లెడ పాత బ్రిడ్జి నుంచి దూప తండా పరివాహక ప్రాంతం వరకు కొంతమంది ప్రతిరోజూ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.