TG: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(82) అంత్యక్రియలను ఇవాళ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌లోని తన నివాసానికి తరలించారు.