CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.ఎం. థామస్ గురువారం వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో పర్యటించనున్నారు. సాయంత్రం 7 గంటలకు “మన ఊరికి మన థామస్” కార్యక్రమంలో భాగంగా ఆయన పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.