SKLM: జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు 111 మంది విద్యార్థులు హాజరు కాలేదని డీఈవో రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. 866 మందికి 755 మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. చూచిరాతకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఆరు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు.